ప్రజాశక్తి-మైలవరం : రైతుల ఆవేదన ఈ కూటమి ప్రభుత్వానికి కనబడలేదా అంటూ మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త జోగి రమేష్ ప్రశ్నించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నందు అకాల వర్షాలకు రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని, మొక్కజొన్న, ధాన్యం రాశులను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాత కన్నీరు మంచిది కాదని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రైతన్నకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మాటలు ఏమో కోటలు దాడుతున్నాయని రైతులను మాత్రం పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 20 రోజులుగా మైలవరం మార్కెట్ యార్డ్ లో దిక్కుతోచని స్థితిలో మొక్కజొన్న, వరి రైతులు పంటను కొనే నాథు డు లేకపోవడంతో పడి కాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గాన్ని కెపి పీకే కలిసి దోచేస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను ఎమ్మెల్యేకు పట్టించుకుని తీరిక లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతుల ఆవేదన కనపడలేదా?
07 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 07, 2026, 10:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)