test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేదల ఇళ్లను కూల్చొద్దు : సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ

30 మే, 2026

పేదల ఇళ్లను కూల్చొద్దు : సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 11:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


విజయవాడ : గత 100 సంవత్సరాలకు పైగా నిడమానూరు సి డబ్ల్యూ సి గోడౌన్ ఎదురుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న వారి ఇళ్ళను తొలగించవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ విజ్ఞప్తి చేశారు. విజయవాడ రూరల్ మండలం తాహసిల్దార్ కి ఈ మేరకు శనివారం బాధితులతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైవస్ కాలువ, రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పేదల నివసిస్తున్న ఇళ్లకు మార్కింగ్ వేశారు. కానీ పేదలతో మాట్లాడడం గాని, వారికి కనీసం నోటీసులు ఇవ్వడం గానీ చేయలేదు. మీరు వెంటనే ఖాళీ చేయకపోతే సామాన్లు కూడా తీసుకుని పోకుండా మీ ఇళ్లు కూల్చి వేస్తామని రైల్వే, రెవెన్యూ అధికారులు బెదిరించారు. దీనితో వారంతా భయభ్రాంతులకు గురై నిద్రాహారాలు లేకుండా ఎప్పుడు ఏ ప్రమాదం ముంకొస్తుందొనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ధైర్యం చెప్పి వాళ్ళ ఇళ్ళని,చిరువ్యాపారాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారుల మీద ఉందని ఆయన అన్నారు. వారి ఇళ్ళను కాపాడటం కోసం వారితోకలిసి ఆందోళన చేస్తామని చేస్తామని ఆయన చెప్పారు. తహసీల్దార్ మాట్లాడుతూ... నష్టపోయే వారికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి చెప్పామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఏ వెంకటేశ్వరరావు,విజయవాడ రూరల్ మండల కార్యదర్శి మాతంగి ఆంజనేయులు, మండల కమిటీ సభ్యులు పి వెంకటేశ్వరరావు, బాధితులు బి కోటేశ్వరావు, వి శృతి , ఎం కుమార్, బడుగు రమేష్ బాబు, మీసాల వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్