ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్: అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి నంద్యాల మీదుగా మార్కాపురం వరకూ నూతన రైళ్లు ప్రారంభయ్యాయి. గుంతకల్లు టు మార్కాపురం రైలును దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డిఆర్ఎం సుధేష్టసేన్ తో ఎంపి బైరెడ్డి శబరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమానాశ్రయం లాగా నంద్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశామని, మరింత ఆధునీకరించి రైల్వే ప్రయాణికులకు ఆధునిక వసతి, తక్కువ ఛార్జీ, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే రూ. 24 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, నంద్యాలకు రైల్వే గూడ్స్ స్టేషన్ కొత్తగా మంజూరయిందని ప్రకటించారు.
గుంతకల్లు టు మార్కాపురం రైలు ప్రారంభం
15 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 15, 2026, 04:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)