ప్రజాశక్తి-మార్కాపురం: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా …. స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నుండి కంభం సెంటర్ వరకు వైద్యఆరోగ్య శాఖ సిబ్బందితో శనివారం నిర్వ హించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియావ్యాధి అరి కట్టడానికి 2008 సంవత్సరం నుండి ప్రపంచ మలేరియా దినముగా ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించ డానికి ఈ సంవత్సరం మలేరియా అంతం మన పంతం అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించ డానికి ర్యాలీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. మలేరియా వ్యాధి చాలా ప్రాణాం తకమైనదని, ఆ వ్యాధిబారిన పడ కుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అని ఆమె చెప్పారు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో నీరు నిల్వలు లేకుండా పరిసరాలను పరిశుభ్ర తగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. మార్కాపురం జిల్లాలో 60 వేల మందికి మలేరియా పరీక్షలు చేపట్టడం జరిగిందని ఎవ్వరికి కూడా పాజిటివ్ రాలేదని ఆమె చెప్పారు. అనంతరం కంభం సెంటర్లో వైద్యఆరో గ్యశాఖ అధికారు లతో సిబ్బందితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.బి.మనష్ ,జిల్లా ఎయిడ్స్ కంట్రొల్ అధికారి డాక్టర్ రాహుల్, డాక్టర్ శ్రావణి ,డాక్టర్ అనూష డాక్టర్ చేతన్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మలేరియా వ్యాధిని అరికట్టాలి
25 ఏప్రిల్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఏప్రి 25, 2026, 11:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)