ప్రజాశక్తి-మోపిదేవి: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన యాత్రికురాలు మృతి చెందారు. మృతి చెందిన భక్తురాలు ఏలూరు జిల్లా, కైకలూరు మండలం, కైకలూరు గ్రామానికి చెందిన మానుపాటి శ్రీదేవి (50)గా గుర్తించారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చి ఆకస్మాత్తుగా శ్రీదేవి మృతి చెందిన సంఘటన బుధవారం స్వామివారి ఆలయం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, కైకలూరు మండలం కైకలూరు గ్రామానికి చెందిన మానుపాటి శ్రీదేవి (50) స్వామివారి దర్శనం చేసేందుకు, మంగళవారం రాత్రి దేవాలయంలో నిద్ర చేసింది. ఈరోజు తెల్లవారుజాము చూడగానే మృతి చెందినట్లు తోటి యాత్రికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోపిదేవి ఎస్ఐ గౌతమ్ కుమార్ తెలిపారు.
మోపిదేవి ఆలయం వద్ద యాత్రికురాలు మృతి
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 11:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)