ప్రజాశక్తి-ప్రత్తిపాడు (కాకినాడ) : కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో ఆదివారం జరిగింది. గోనేడ గ్రామానికి చెందిన సత్యం శెట్టి వెంకటలక్ష్మికి పెద్దాపురం మండలం మర్లవ గ్రామానికి చెందిన గాది కోటేశ్వరరావుకి ఈ సంవత్సరం ఏప్రిల్ 25 తేదీన వివాహం చేశారు. వివాహం జరిగి కనీసం నెల కూడా కాకుండానే భర్త వెంకటలక్ష్మి ని వేధింపులు పెట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి కిర్లంపూడి ఎస్సై సతీష్ , పోలీసులు చేరుకున్నారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నవ వధువు ఆత్మహత్య
17 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 17, 2026, 01:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)