ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఈసెట్ (AP ECET) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. కాకినాడ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం-4లో ఉంటూ, కాకినాడ ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో డి.ఫార్మసీ పూర్తి చేసిన ఎన్. అనూష.. ఈసెట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి ప్రతిభ చాటారు. ఆమెతో పాటు 17వ ర్యాంకు సాధించిన పి. రాజ్యలక్ష్మి, 160వ ర్యాంకు సాధించిన వి. నీలవేణిలను కలెక్టర్ దుశ్శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేదరికంలో ఉండి కూడా పట్టుదలతో చదివి ఉన్నత ర్యాంకులు సాధించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థినులను ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం. శోభారాణి, ఎస్.డబ్ల్యూ.ఓ వై. వాణి, హెచ్.డబ్ల్యూ.ఓ జి. ఉషారాణి, కార్యాలయ సిబ్బంది పి.టి. దొర తదితరులు పాల్గొన్నారు.
ఏపీఈసెట్ రాష్ట్ర ఫస్ట్ ర్యాంకర్ ఎన్. అనూషను సత్కరించిన జిల్లా కలెక్టర్
11 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 11, 2026, 07:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)