ఫిట్ ఇండియా సైకిల్ డ్రైవులో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
ప్రజాశక్తి-కాకినాడ : జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా పాల్గొని సైక్లింగ్‌ను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా తోడ్పడవచ్చని తెలిపారు. యువతతో పాటు అన్ని వయస్సుల ప్రజలు సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ సబ్ డివిజనల్ ఆఫీసర్ దేవ రాజ్ మనీష్ పాటిల్, ఎస్‌బీ డీఎస్పీ కె వి వి సత్యనారాయణ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఆర్ నరసింహ మూర్తి,డీసీఆర్‌బీ సీఐ వి శ్రీనివాస రావు, వివిధ పోలీసు స్టేషన్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఏ.బి.జి. తిలక్ నేతృత్వంలోని పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో సామర్లకోట సీఐ ఆళ్ల కృష్ణ భగవాన్, ఎస్‌ఐ మూర్తి, ఎస్‌ఐ గరగారావు, ఎస్‌ఐ రాజా, పెద్దాపురం సీసీఎస్ సీఐ శ్రీ అంకబాబు, ఎస్‌ఐ మౌనిక, ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూరి అప్పారావు, ఉమెన్ ఎస్ ఐ ఎస్. లక్ష్మి కాంతం, జగ్గంపేట ఎస్ ఐ టి రఘునాథ్ రావు ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య అవగాహన, ఫిట్‌నెస్ పట్ల ఆసక్తి, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కలిగించడంలో విజయవంతమైంది.








కామెంట్‌లు (0)