ప్రజాశక్తి-కాకినాడ: ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న తుని మండలం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు జిల్లాలో ప్రతి శుక్రవారం నిర్వహించనున్నామని అన్నారు. ఈ నెల 29న శుక్రవారం తుని ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వివిధ ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమానికి డివిజన్, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు ఉదయం 9:30 నిమిషాలకే తుని ఎంపీడీవో కార్యాలయానికి విధిగా చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
శుక్రవారం తునిలో వన్ మంత్– వన్ విలేజ్– ఫోర్ విజిట్స్ కార్యక్రమం
28 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 28, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)