test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం : సిఐ

24 మే, 2026

kakinada ci
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 24, 2026, 01:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – జగ్గంపేట (కాకినాడ) : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని సిఐ బి. తిరుపతిరావు అన్నారు. ఆదివారం సిఐ సర్కిల్ కార్యాలయంలో మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ మాదిరిగా సర్కిల్ పరిధిలో డ్రగ్ డిటెక్షన్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు నిరంతరం డ్రగ్ డిటెక్షన్ తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. వాహనదారులు, వ్యక్తులపై డ్రగ్ డిటెక్షన్ తనిఖీ తప్పనిసరిగా జరుగుతుందన్నారు. జగ్గంపేట పోలీస్ స్టేషన్లో డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని ఎవరైనా అనుమానితంగా ఉంటే ఆ కిట్ల ద్వారా తనిఖీ జరుగుతుందన్నారు. డ్రగ్స్ వాడటం సరఫరా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. డ్రగ్స్ వాడిన, సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని భవిష్యత్తు కోసం ఆలోచించాలని హితవు పలికారు. డ్రగ్స్ సరఫరా వాడకంపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. డ్రగ్స్ వాడకం సరఫరా పై సమాచారం తెలిస్తే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112, నార్కోటిక్ హెల్ప్ లైన్ 1972 నెంబర్లను సంప్రదించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్