
చిలకలూరిపేట (గుంటూరు) : చౌడవరం వద్ద ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై జరిగిన దాడికి నిరసనగా …. చిలకలూరిపేట ఆర్టిసి డిపో కార్మికులు చేపట్టిన సమ్మె వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై కొందరు యువకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ …. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు బస్సులను నిలిపివేశాయి. అధికారులతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో డిపోకు చెందిన బస్సులు రోడ్డెక్కలేదు. దీనివల్ల స్థానిక ప్రయాణికులు మండుటెండలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. చిలకలూరిపేట డిపో బస్సులు ఆగినా, ఇతర డిపోలకు చెందిన బస్సులు బయట డిపో బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. అయితే స్థానిక సర్వీసులు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నరకయాతన తప్పడం లేదు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని సమ్మె విరమింపజేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలు లేదా ఇతర డిపోల బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది.









కామెంట్‌లు (0)