test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమస్యలు వెంటనే పరిష్కరించాలి

27 ఏప్రిల్, 2026

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఏప్రి 27, 2026, 03:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
వెలుగు విఒఎల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి వెలుగు విఒఎ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు జిల్లావ్యాప్తంగా విఒఎలు హాజరయ్యారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని కోరుతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సుభాషిణి, జిల్లా గౌరవాధ్యక్షులు డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలకంగా పని చేస్తున్న విఒఎలకు కనీస వేతనాలు పెంచకుండా పని చేయించుకోవడం దారుణమన్నారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. స్త్రీ నిధి ఇన్సెంటివ్స్‌, బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు వెంటనే నిలిపివేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే విఒఎల సమస్యలు పరిష్కరించాలని, నాణ్యమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు, డిఆర్‌డిఎ పీడీకి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పార్వతి, ఉపాధ్యక్షులు విజయకుమారి, ఇందిరా, లక్ష్మీదేవి, లలిత కుమారి, కుమారి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్