ప్రజాశక్తి – చింతలపూడి :
మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు ఉంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులకు వెళ్లాల్సిన వారు గంటల తరబడి బంకుల వద్ద క్యూల్లో పడిగాపులు పడుతున్నారు. కొన్ని బంకుల్లో ఇంధనం ఉన్నప్పటికీ సరఫరా చేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. 108కు ఆయిల్ కోసం తహశీల్దార్ కార్యాలయం వద్దకు వస్తున్న పరిస్థితి నెలకొంది. పరిస్థితి తీవ్రతను గమనించిన చింతలపూడి ఎంఎల్‌ఎ సొంగా రోషన్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగి కొన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఇంధనం ఉన్నప్పటికీ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో క్యూలో నిలిచిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఎల్‌ఎ హెచ్చరించారు.
‘నో స్టాక్’ బోర్డులు
27 ఏప్రిల్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఏప్రి 27, 2026, 03:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)