ప్రజాశక్తి-పలమనేరు : చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ అధికారులు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దినసరి కూరగాయల మార్కెట్ యార్డు, పెద్ద చెరువు కట్ట తదితర ప్రాంతాల్లో స్థానికులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి క్లీనింగ్ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా శనివారం ఆపరేషన్ క్లీన్ స్లీప్ కు పిలుపు నిచ్చిందన్నారు. అందులో భాగంగా పలమనేరు మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు నరసింహులు, శ్రీపురం సీతారామయ్య నారాయణ, పొమ్మడి, టిడిపి నాయకులు, బిఆర్సి కుమార్, సుబ్రహ్మణ్యం గౌడ్, కిరణ్ రాయల్, గిరి కుమార్, సుధాకర్, నాగరాజు, మున్సిపల్ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.
పలమనేరు మున్సిపాలిటీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్
23 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 23, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)