test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు – పరిస్థితి విషమం

20 మే, 2026

https://prajasakti.com/district-news/two-people-were-seriously-injured-in-the-road-accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 20, 2026, 04:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వీకోట (చిత్తూరు) : మండల పరిధిలోని ఏడుచుట్ల కోట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు వివరాలు …. నాయకనేరి కొత్తూరుకు చెందిన యువరాజ్ (35) బైక్ పై వీకోటకు వెళుతుండగా, ప్రమాదవశాత్తు ఏడుచుట్ల కోట్ల వద్ద నడిచి వెళ్తున్న మురుగేష్ (40) అడ్డు రావడంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మురుగేష్ యువరాజులు ఇద్దరూ కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు చికిత్స నిమిత్తం ఇద్దరిని 108 వాహనంలో వీకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కుప్పం మెడికల్ కళాశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్