ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ నెల 20 న మెడికల్ షాపుల బంద్ చేపట్టనున్నట్లు పలమనేరు మెడికల్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం తెలిపారు. వారు మాట్లాడుతూ …. రోగులకు వాడే మందులను ఆన్లైన్ అమ్మకాలు, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్ పద్ధతిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనికితోడు నకిలీ మందుల అమ్మకాన్ని నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అత్యవసర మందులు కావలసినవారు ముందుగానే సమకూర్చుకోవాలని కోరారు.
పలమనేరులో మే 20 న మెడికల్ షాపులు బంద్
18 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 18, 2026, 05:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)