test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పలమనేరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

5 రోజుల క్రితం

bus acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 10, 2026, 10:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–పలమనేరు:చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కింద పడి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో పలమనేరు నుండి పెనుగొలకలకు వెళ్లే ఆర్టీసీ బస్సును బస్టాండ్‌లో పార్కింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో పలమనేరు జవిలి వీధికి చెందిన నరసింహులు శెట్టి అనే వ్యక్తిపైకి ఆర్టీసీ బస్సు ముందు చక్రం వెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్