బాపట్ల : కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా కేంద్రంలో భద్రపరిచిన ఈవీఎంల గోదాంను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఐఏఎస్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో జి. గంగాధర్ గౌడ్, ఆర్డీఓ పి. గ్లోరియా, తహసీల్దార్ షేక్ సలీమా, ఎన్నికల పర్యవేక్షకులు షఫి తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలించిన కలెక్టర్ వినోద్ కుమార్
18 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 18, 2026, 10:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)