test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రాక్టర్ బోల్తా – 9 మంది కూలీలకు గాయాలు

18 మే, 2026

ట్రాక్టర్ బోల్తా – 9 మంది కూలీలకు గాయాలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 10:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కలకడ/కె.వి.పల్లి (అన్నమయ్య) : కె.వి పల్లి మండలంలోని కలకటవారిపల్లి సమీపంలో మలుపు వద్ద ఆదివారం ట్రాక్టర్ ఏపీ 39 ఎన్ కే 6935 నెంబర్ గల ట్రాక్టరు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. దామలచెరువు నుండి మామిడికాయలు కోయటానికి 12 మంది కూలీలతో మారెళ్ళకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మలుపు వద్ద ట్రాక్టర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి రక్త, గీకుడు గాయాలు కాగా, ట్రాక్టర్ డ్రైవర్ చుక్కలపాటి లక్ష్మయ్య (22) సురక్షితంగా బయటపడ్డాడు. గాయపడినవారిలో జింకల జ్యోతి (32), చుక్కలపాటి గౌరీ (22, గర్భిణి), చుక్కలపాటి రమేష్ (43), చుక్కలపాటి రాజేశ్వరి (35), టి. సుగుణ (28), పి. మౌనిక (20), పి. మనోహర (25), శ్రీ నక్షత్ర (2), పి. సిద్దు (9) ఉన్నారు. వీరందరూ ఇర్లపాలెం–ఎర్రవారిపాలెం ప్రాంతాలకు చెందినవారని తెలిసింది. గాయపడినవారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేయగా, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట శివకుమార్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్