test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓబులాపురానికి తాగునీరివ్వండి : సిపిఎం

2 రోజుల క్రితం

మండలం కేంద్రంలో ఓబులాపురం గ్రామంలో తాగునీరు సమస్య తీవ్రంగా ఉంది.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలం కేంద్రంలో ఓబులాపురం గ్రామంలో తాగునీరు సమస్య తీవ్రంగా ఉంది. శుక్రవారం సిపిఎం మండల కమిటీ గ్రామస్తులను కలిసి వారి సమస్యను తెలుసుకోవడం జరిగినది. సిపిఎం మండల కార్యదర్శి సూరి మాట్లాడుతూ …. మూడు రోజుల నుండి తాగునీరు రావడం లేదనీ, కాబట్టి గ్రామంలో ఉన్న మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీగా కోరుతున్నామన్నారు. మోటార్ల దగ్గర కూడా కంప చెట్లు పెరిగి వైర్లు కాలిపోయి మోటర్లు కూడా ఆడడం లేదని తెలిపారు. పైపులుపగిలిపోయి నీళ్లు కలుషితం అవడం జరుగుతుందన్నారు. కలుషితమైన నీటిని తాగుతున్నారని, ఆ కలుషిత నీరే తిరిగి రిటర్న్ పైపులకు వెళుతుందని చెప్పారు. ఆ నీటిని తాగడం వల్ల విష జ్వరాలు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్ లైన్ కూడా భూమి మీద లాగడం జరిగిందని, వైర్లు నేల మీద ఉండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. మరమ్మతులు చేయకపోతే గ్రామస్తులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేవీపీస్ మండల కార్యదర్శి నాగభూషణం, యేసు రత్నం, మల్లికార్జున, టీ పెద్దయ్య, నారాయణనాగముని, రామకృష్ణ, కుల్లాయి లక్ష్మీనారాయణ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్