ప్రజాశక్తి : చీడికాడ మండలం కోణాం రి సర్వేలో భాగంగా సాగులో ఉన్న వారందరికీ నమోదు చేసి గత రీ సర్వేలో జరిగిన తప్పులను సరిచేయాలని కోరుతూ కోణం సచివాలయం వద్ద సిపిఐ(ఎం) ఆందోళన చేపట్టింది. అనంతరం గ్రామ సచివాలయం సర్వేయర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గసభ్యులు గంటా శ్రీరామ్, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోణం పంచాయతీలో 14 గ్రామాల్లో సుమారు 350 నుండి 400 వరకు గిరిజనులు, పేద రైతులు వాళ్ళ తాత తండ్రుల నుండి ఆ భూమిని సాగు చేసుకుని జీవనోపాది పొందుతున్నారని, వారందరికీ న్యాయం చేయాలని కోరారు. గత 60 సంవత్సరాల నుండి అనేకమార్లు అధికారులు దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదని ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న రీసర్వే ద్వారా అయినా గత తప్పులను సరిచేయాలని కోరారు. ఏ భూములు ఎవరు సాగుదారులుగా ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలని అన్నారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, దుప్పు దాసు, చలుగు భీము నాయుడు, దారకొండ, బొబ్బరి నాగరాజు, చలుగు శ్రీనివాసరావు, గాలి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
సాగులో ఉన్న వారందరిని రీసర్వేలో నమోదు చేయాలి : సిపిఎం
15 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 15, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)