అచ్యుతాపురం (అనకాపల్లి) : లేబర్ కోడ్స్ పై రూల్స్ నోటిఫికేషన్ 8వ తేదీ రాత్రి నుండి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిని నిరసిస్తూ …. ఎస్ ఈ జడ్ లో నోటిఫికేషన్ కాపీలు దగ్ధం చేసి ఆదివారం నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్. రాము మాట్లాడుతూ …. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత లేబర్ కోడ్ లను అమలులోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ తీసుకొచ్చిందన్నారు. దీనివలన వేతనాలు కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ 2020 లను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాలు రద్దయిపోతాయి. దీనివలన ప్రస్తుతమున్న ఎనిమిది గంటల పని దినం 12 గంటల వరకు పని చేయించుకునే అధికారం వచ్చి ఇతర కార్మికులు తమ హక్కులను నష్టపోయి యాజమాన్యాలకు కార్మికుల శ్రమను అప్పణంగా కట్టబెట్టడమే అవుతుందని వాపోయారు. ఈ లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కారు సత్యం, ఎరునాయుడు ,రాజన్న సన్యాసిరావు, లాలం సన్యాసిరావు ,అప్పారావు, రెడ్డి రామానాయుడు సిరిసిపల్లి అప్పారావు, రాము తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ దగ్ధం చేస్తూ నిరసన
15 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 15, 2026, 11:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)