తెలంగాణ : తమతో కలిసి రావాలన్న ప్రధాని మోడి పిలుపును స్వాగతిస్తున్నామని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆదివారం ప్రధాని అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆయన పిలుపులో రాజకీయాలకు తావులేదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్‌లాగే విజన్ 2047 సాధనకు, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని తెలిపారు. తమ పార్టీలు, ఐడియాలజీ వేరైనా.. అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఎన్నోసార్లు కలిసినా.. కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదని, 2 గంటలు సమయమిస్తే తమ ప్రణాళికలు ప్రధానికి వివరిస్తామని చెప్పారు.
మోడి పిలుపును స్వాగతిస్తున్నాం : సిఎం రేవంత్ రెడ్డి
11 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 11, 2026, 03:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)