test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు – నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ..!

09 మే, 2026

మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు – నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ..!

మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు – నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ..!

వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 09, 2026, 11:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ముంబయి : ముడిచమురు ధరలు మళ్లీ పెరిగిన వేళ …. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బిఎస్​ఈ సెన్సెక్స్​ 114 పాయింట్లు పడి 77,845 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 4 పాయింట్లు కోల్పోయి 24,327 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 66 పాయింట్లు పెరిగి 56,047 వద్దకు చేరింది. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 341 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 441 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం. గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.63 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.38శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.13 శాతం డౌన్​ అయ్యింది. “ టెక్నికల్​గా చూసుకుంటే నిఫ్టీ50కి 24,100- 24,150 లెవల్స్​ వద్ద కీలక సపోర్ట్​ ఉంది. 24,500- 24,550 వద్ద కీల రెసిస్టెన్స్​ ఉంది. రెండింటిలో ఏది బ్రేకౌట్​ అయితే అటువైపు నిఫ్టీ50 డైరక్షన్​ తీసుకోవచ్చు,” అని చాయిస్​ బ్రోకింగ్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ సుమీత్​ బగాడియా తెలిపారు.

అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్​ క్రూడ్ 1.36 శాతం పెరిగి బ్యారెల్​కి 101.42 డాలర్లకు చేరింది. ఐఈఎక్స్​- బై రూ. 132, స్టాప్​ లాస్​ రూ. 130, టార్గెట్​ రూ. 138, కేఈసీ ఇంటర్నేషనల్- బై రూ. 600, స్టాప్​ లాస్​ రూ. 590, టార్గెట్​ రూ. 625, సులా వైన్​యార్డ్స్​- బై రూ. 175, స్టాప్​ లాస్​ రూ. 170, టార్గెట్​ రూ. 185, ఆర్బీఎల్​ బ్యాంక్- బై రూ. 345.7, స్టాప్​ లాస్​ రూ. 330, టార్గెట్​ రూ. 375, హీరో మోటోకార్ప్- బై రూ. 5343, స్టాప్​ లాస్​ రూ. 5130, టార్గెట్​ రూ. 5750, హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్- బై రూ. 4782, స్టాప్​ లాస్​ రూ. 4600, టార్గెట్​ రూ .5125, క్రాంప్టన్ గ్రీవ్స్​- బై రూ. 290.7, స్టాప్​ లాస్​ రూ. 280, టార్గెట్​ రూ. 310, డెల్హివరీ- బై రూ. 481.7, స్టాప్​ లాస్​ రూ. 460, టార్గెట్​ రూ. 520.

మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు – నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ..!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్