బెంగళూరు : దేశంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా అవతరించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆ కంపెనీ సిఇఒ, ఎండి కె కృతివాసన్ వెల్లడించారు. అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో ఎఐ విస్తరణ ఊపందుకుంటున్న తరుణంలో టిసిఎస్‌కు ఏడాదికి 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందించే 139 అగ్రశ్రేణి అంతర్జాతీయ క్లయింట్లలో 130 మంది తమ ఏఐ భాగస్వామిగా తమ సంస్థనే ఎంచుకున్నారని 2025-26 వార్షిక నివేదికలో తెలిపారు. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీ తన ఎఐ శ్రామిక శక్తిని మూడు రెట్లు పెంచి 2,70,000 మంది ఉద్యోగులకు అధునాతన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్‌తో పాటు దేశీయ డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు. రూ. 5 లక్షల కోట్లకు పైగా లావాదేవీలు జరిపే గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ విస్తరణ, 20 కోట్ల మంది వినియోగదారుల కోసం ఎస్‌బీఐ యోనో 2.0 అప్‌గ్రేడ్, కోటికి పైగా ఈ-పాస్‌పోర్ట్‌ల జారీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక విశ్లేషణల కోసం ఏకంగా 250 టిబి డేటాను నిర్వహించగల అత్యాధునిక డేటా మేనేజ్మెంట్ సిస్టమ్‌ను కూడా విజయవంతంగా నిర్మించిందని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ ఏఐ దిగ్గజంగా అవతరించడమే లక్ష్యం
16 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 16, 2026, 11:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)