test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహారాష్ట్రలో బైక్‌, ట్యాక్సీలు రద్దు..!

16 మే, 2026

ఉబర్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 16, 2026, 11:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : మహారాష్ట్రలో చట్టవిరుద్ధంగా బైక్ ట్యాక్సీ సేవలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో ఓలా, ఉబర్, ర్యాపిడో మొబైల్ యాప్‌లపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ సంస్థలు మోటార్ వాహనాల నిబంధనలను పాటించకుండా.. ఎటువంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా బైక్ రైడింగ్ సేవలను అందిస్తున్నాయని పేర్కొంటూ మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సైబర్ విభాగానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తమ యాప్ స్టోర్స్ నుండి ఈ మూడు యాప్స్‌ను వెంటనే తొలగించాలంటూ మహారాష్ట్ర స్టేట్ సైబర్ డిపార్ట్‌మెంట్ గూగుల్, యాపిల్ సంస్థలకు అధికారికంగా నోటీసులు జారీ చేయడంతో రాష్ట్రంలో క్యాబ్, రైడ్ సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో కర్ణాటక ప్రభుత్వం కూడా మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేదనే కారణంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఇలాగే సేవలను నిలిపివేసింది. ఆ తర్వాత ఓలా, ఉబర్ సంస్థలు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయడంతో న్యాయస్థానం పాత తీర్పును పక్కనబెట్టింది.

మోటార్ వాహనాల చట్టం ప్రకారం బైక్ ట్యాక్సీలను కూడా రవాణా వాహనాలుగా పరిగణించవచ్చని, అవసరమైన చట్టబద్ధమైన అనుమతులతో వీటిని నడుపుకోవచ్చని కర్ణాటక కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో దీనిపై ఆదారపడిన రైడర్లు, స్థానిక ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్