బిజినెస్ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న సంక్షోభం నేపథ్యంలో ... ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. అయినప్పటికీ.. ప్రభుత్వరంగ చమరు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే, అవి తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ... లీటరుకు రూ.3 పెంచి వాహనదారులపై కొంత భారాన్ని మోపాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే, సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ క్రమంలో ధరలు పెంచడం గమనార్హం. కాగా.. ఈ ప్రకటనలకు ముందే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు దేశంలోని వాహనదారులను ఆందోళనకు గురిచేశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
సీఎన్‌జీ ధర పెంపు ....
సీఎన్‌జీ వాహనదారులకు కూడా గ్యాస్ కంపెనీలు షాకిచ్చాయి. కిలో సీఎన్‌జీని రూ.2 చొప్పున పెంచాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ3.29, డీజిల్‌పై రూ.3.14, తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. పెట్రోల్ ధరలు ... ల్లీలో రూ.97.77 (+3.00), కోల్‌కతాలో 108.74 (+3.29), ముంబయిలో 106.68 (+3.14), చెన్నైలో 103.67 (+2.83)గా ఉండనున్నాయి. ఇక డీజిల్ ధరలు: దిల్లీలో 90.67 (+3.00), కోల్‌కతాలో 95.13 (+3.11), ముంబయి 93.14 (+3.11), చెన్నైలో 95.25 (+2.86)గా ఉండనున్నాయి.








కామెంట్‌లు (0)