న్యూఢిల్లీ : దేశంలో ఈ ఏడాది మే నెలలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జిఎస్‌టి వసూళ్లలో 3.2 శాతం పెరుగుదల కనిపించింది. కాగా.. రీఫండ్ల సర్దుబాటు అనంతరం మే నెలకు నికర జిఎస్‌టి వసూళ్లు రూ.1,66,904 కోట్లుగా చోటు చేసుకున్నాయి. మొత్తంగా రీఫండ్లు 2.6 శాతం పెరిగి రూ.27,281 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే స్థూల దేశీయ జిఎస్‌టి రాబడి 2.6 శాతం తగ్గి రూ.1.34 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇదే సమయంలో దిగుమతులపై వసూళ్లు భారీగా 19.1 శాతం పెరిగి రూ.59,654 కోట్లకు చేరడం గమనార్హం. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలైన ఏప్రిల్, మే కాలానికి గాను మొత్తంగా జిఎస్‌టి వసూళ్లు 6.2 శాతం పెరిగి రూ.4.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
జిఎస్‌టి వసూళ్లలో 3.2 శాతం వృద్ధి
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 01, 2026, 11:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)