మనీలా: ఫిలిప్పీన్స్‌లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైనట్లు అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS) వెల్లడించింది. మిండనావో దీవులకు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ భూకంపం నేపథ్యంలో పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తీరప్రాంతాలకు హై-అలర్ట్ ప్రకటించింది. సముద్రంలో 1 నుండి 3 మీటర్ల (సుమారు 10 అడుగులు) ఎత్తులో రాకాసి అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియా, మలేషియాలకు కూడా సునామీ ముప్పు ఉంటుందని తెలిపారు. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సునామీ ముప్పు పొంచి ఉండటంతో తీరప్రాంత ప్రజలను తక్షణమే సురక్షితమైన, ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని ఫిలిప్పీన్స్ విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని కోరింది. ఫిలిప్పీన్స్ దేశం భౌగోళికంగా పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్‌లో ఉండటం వల్ల ఇక్కడ తరచూ భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.
ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ!
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 08:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)