పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను జర్మనీ స్టార్, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ కైవసం చేసుకున్నాడు. నువ్వానేనా అన్నట్లుగా ఆదివారం జరిగిన ఫైనల్ లో ఇటలీ ఆటగాడు ఫ్లావియో కొబోలిపై 6-1, 4-6, 6-4, 6-7 (7-5), 6-1 స్కోరు తేడాతో జ్వెరెవ్ గెలిచాడు. నాలుగో రౌండ్లో కొబోలీ టైబ్రేకర్లో విజయం సాధించడంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్కు దారితీసింది. అయితే చివరి సెట్ పూర్తి ఆధిపత్యాన్ని సాధించిన జ్వెరెన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. జ్వెరెవ్కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. రెండేళ్ల క్రితం ఇదే టోర్నితో సహా మూడు స్లారు గ్రాండ్ స్లామ్ టోర్నిల్లో ఫైనల్కు చేరుకున్నా టైటిల్ గెలుచుకోవడంలో జెర్వెవ్ విఫలం చెందాడు. ఈ సారి మాత్రం పట్టు విడలేదు. తుదిపోరులోనూ విజయం సాధించాడు. తన కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకోవ డంతో పాటు 30 ఏళ్ల తరువాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న తొలి జర్మన్ ఆటగాడిగా నిలిచాడు. 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్న తరువాత మళ్లీ అలాగే, ఈ ఓపెన్ ఎరాలో ముగ్గురు జర్మనీ ఆటగాళ్లు మాత్రమే గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించారు. బెకర్ 1985 నుండి 1996 మధ్య ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకోగా, మైఖేల్ స్టిచ్ స్టిచ్ 1991లో వింబుల్డన్ టైటిల్ గెలిచారు.
French Open : విజేతగా జ్వెరెవ్
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 08:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)