ముంబయి : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ముకేష్ అంబానీ వరుసగా ఆరో ఏడాది కంపెనీ నుండి రూపాయి కూడా జీతం తీసుకోలేదు. గురువారం విడుదలైన రిలయన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. కంపెనీ రికార్డు లాభాలను ఆర్జించినప్పటికీ.. ఆయన సున్నా వేతనాన్నే తీసుకున్నారు. ఈ ఆరేళ్ల కాలంలో ఆయన ఎలాంటి జీతం, అలవెన్సులు, పారితోషికాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమీషన్ లేదా స్టాక్ ఆప్షన్లను తీసుకోలేదని కంపెనీ స్పష్టం చేసింది. ఆర్థిక సంవత్సరం 2025-26లో రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయ కార్పొరేట్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 95,754 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
Print Editionముకేష్ అంబానీ వేతనం యథాతథం
28 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 28, 2026, 10:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)