test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి

19 గంటల క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 06:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – మైలవరం: మైలవరం మండలం వేపరాల గ్రామం సమీపంలోని పెన్నా నదిలో స్నానానికి వెళ్లిన అత్త, అల్లుడు నీటిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… తొర్రివేముల గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు సరదాగా స్నానం చేయడం కోసం పెన్నా నదికి వెళ్లారు. అయితే, నీటి లోతును గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు కళ్యాణ్ కుమార్ (25), అతని అత్త వరుస అయిన వెంగమ్మ (45) నీటిలో మునిగిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా మొదట కళ్యాణ్ కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు.  వెంగమ్మ మృతదేహం కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఊహించని ప్రమాదంతో తొర్రివేముల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్