మెడికల్ కళాశాల ప్రిన్సిపల్స్ కూడా...
ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలోని పలు జనరల్ ఆస్పత్రులకు నూతన సూపరింటెండెంట్‌లను, మెడికల్ కళాశాలలకు ప్రిన్సిపల్స్‌ను నియమిస్తూ రాష్ర్టప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ ఎడ్యుకేషన్ అదనపు డైరెక్టర్ జి.రఘునందన్‌ను విజయవాడ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా, కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల డాక్టర్ విష్ణువర్థన్‌ను డైరెక్టర్ మెడికల్ సైస్సెన్స్‌కు (డిఎంఇ)గా బదిలీ చేశారు. ఏలూరు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.ఎస్.రాజును రాజమహేంద్రవరం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు మెడికల్ కళాశాల న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సి.శ్రీనివాసులును పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మెడికల్ కళాశాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా నియమించారు. విశాఖపట్నం మెడికల్ కళాశాల ఎండో క్రినోలజీ ప్రొఫెసర్ కె.ఎ.వి.సుబ్రమణ్యంను రాజమహేంద్రవరం జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఫార్మాకాలజీ ప్రొఫెసర్ పి.ఉషాకిరణ్‌ను ఇదే కళాశాలకు ప్రిన్సిపల్‌గా నియమించారు. విజయనగరం మెడికల్ కళాశాల ప్యాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బాసుమిత్ర దాస్‌ను పాడేరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బదిలీ చేశారు. విశాఖ మెడికల్ కళాశాల జనరల్ సర్జరీ ప్రొఫెసర్ వి.మన్మధరావును విమ్స్ డైరెక్టర్‌గా నియమించారు. గుంటూరు మెడికల్ కళాశాలలో న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ కె.వి.వి.సత్యనారాయణ మూర్తిని గుంటూరు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా నియమించారు. కర్నూలు మెడికల్ కళాశాల మత్తు వైద్య నిపుణులు ప్రొఫెసర్ జి.విశాలను నంద్యాల జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా, రాజమహేంద్రవరం మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి.వి.వి.సత్యనారాయణ ను ఏలూరు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా, విశాఖపట్నం మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి.సౌమినీని శ్రీకాకుళం జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు.
Print Editionజనరల్ ఆస్పత్రులకు నూతన సూపరింటెండెంట్‌ల నియామకం
28 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 28, 2026, 11:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)