న్యూఢిల్లీ: వ్యాపారులపై మరోసారి గ్యాస్ భారం పడింది. దేశంలో కమర్షియల్ (వాణిజ్య) గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.కేవలం 19 కేజీల సిలిండర్ మాత్రమే కాకుండా, చిన్న వ్యాపారులకు ఉపయోగపడే 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధరను కూడా పెంచారు. దీనిపై రూ. 11 మేర భారం పడింది.అయితే, గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ (వంటగ్యాస్) సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
ప్రధాన నగరాల వారీగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు (19 కేజీలు):
నగరం | పెరిగిన ధర | తాజా కొత్త ధర |
హైదరాబాద్ | రూ. 52.00 | రూ. 3,367.00 |
ఢిల్లీ | రూ. 42.00 | రూ. 3,113.50 |
కోల్కతా | రూ. 53.50 | రూ. 3,255.50 |
ముంబై | రూ. 42.50 | రూ. 3,024.50 |
చెన్నై | రూ. 42.00 | రూ. 3,232.00 |








కామెంట్లు (0)