‘తిరుచ్చి ఈస్ట్’ నుంచి పోటీపై జోరుగా ప్రచారం!
ఈ నెల 11న కీలక ప్రకటన చేయనున్నట్లు ట్వీట్ చేసిన స్టార్ హీరో
చెన్నై: తమిళ సినీ పరిశ్రమ నుంచి మరో స్టార్ హీరో రాజకీయ రంగప్రవేశానికి సర్వం సిద్ధమైనట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, సామాజిక సేవాకర్త రాఘవ లారెన్స్ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టివికె) పార్టీ తరపున కీలకమైన ‘తిరుచ్చి ఈస్ట్’ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రాఘవ లారెన్స్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైందనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలపై రాఘవ లారెన్స్ స్వయంగా స్పందించారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా లారెన్స్ స్పందన
తన రాజకీయ ప్రయాణంపై సాగుతున్న ప్రచారానికి లారెన్స్ సోషల్ మీడియా వేదికగా చెక్ పెట్టారు. “నా భవిష్యత్తు కార్యాచరణ.. తదుపరి అడుగుపై ఈ నెల 11వ తేదీన ఒక కీలక ప్రకటన చేయబోతున్నాను. నా అభిమానులు, ప్రజలు అప్పటివరకు దయచేసి వేచి చూడాలి” అని లారెన్స్ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)