న్యూఢిల్లీ : తమ ఆందోళన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని బొద్దింక జనతా పార్టీ (సిజెపి)వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఆయన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనర్ జిల్లాలోని తన నివాసానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తాము నిర్వహించిన నిరసన ప్రదర్శన చాలా వరకు విజయవంతమైందని, ఈ నిరసన ప్రదర్శనలో సుమారు 6,000 నుండి 7,000మంది ప్రజలు పాల్గొన్నారని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తాము వెనకడుగు వేయమని అన్నారు. ఈ ఆందోళనను దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు తాము తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని అన్నారు.
పరీక్షలు, నియామక ప్రక్రియల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సిజెపి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దీప్కే భయపడవద్దు అని సందేశం ఇచ్చారు. కేంద్రం ప్రధాన్ ను తొలగించే వరకు గానీ లేదా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసే వరకు గాని వారం రోజుల పాటు వేచి చూస్తామని, ఆ తర్వాతే దేశవ్యాప్త నిరసన చేపడతామని ఆయన మీడియాతో పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)