న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నుండి నీట్-యుజి పరీక్షను పూర్తిగా ఆన్ లైన్ లో (కంప్యూటర్ ఆధారితంగా) నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. నీట్-యుజి ప్రశ్నా ప్రతాల లీకేజీకి ప్రధాన కారణం ఓఎంఆర్ షీట్స్ ( ఆప్టికల్ మార్క్స్ రికగ్నిషన్ ) అని చెప్పుకొచ్చారు. నీట్ పరీక్షపై శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఓఎంఆర్ షీట్స్ కారణంగానే లీకేజీ జరుగుతోందని, పారదర్శకతను నిర్థారించడానికి, వచ్చే ఏడాది నుండి నీట్-యుజీ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థుల కష్టాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని అన్నారు. అలాగే నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్ టి ఎ) జూన్ 21న నిర్వహిస్తుందని అన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అవకతవకలపై సిబిఐ సమగ్ర విచారణ జరుపుతుందని అన్నారు. ఇటువంటి అవకతవకలు మరోసారి జరగనివ్వమని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను వాపసు ఇస్తామని అన్నారు. మరోసారి పరీక్ష రాసే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన పరీక్ష కేంద్రాన్ని ఎంచుకునేందుకు కూడా ఎన్ టిఎ అనుమతిస్తుందని అన్నారు. అయితే ఎన్ టి ఎను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది నుండి ఆన్ లైన్ లో నీట్ పరీక్ష
15 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 15, 2026, 02:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)