test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అబుదాబి ఎమిరేట్ లోని అణువిద్యుత్ కేంద్రంలో మంటలు

17 మే, 2026

fire at UAE's Barakah Nuclear Power Plant
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 04:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

యుఎఇ : అబుదాబి ఎమిరేట్ లోని ఒక అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో అణువిద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని, రేడియేషన్ భద్రతా స్థాయిలు కూడా ప్రభావితం కాలేదని అన్నారు. అల్ ధఫ్రా ప్రాంతంలోని బరకా అణువిద్యుత్ కేంద్రం లోపలి పరిధిలో ఉన్న విద్యుత్ జనరేటర్ పై డ్రోన్ దాడి కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అబుదాబి అధికారులు తెలిపారు. ప్లాంట్ లోని కీలక వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్ తెలిపింది.  అయితే అనుమానిత డ్రోన్ దాడికి  బాధ్యులు ఎవరో తెలియదని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్