test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘ పెట్రో ‘ ధరల భారంపై నిరసనలు

26 మే, 2026

petrol dharna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 26, 2026, 11:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – యంత్రాంగం : పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. గడిచిన పది రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి అని, యుద్ధాని బూచిగా చూపిస్తూ ఇంధన ధరలను రోజురోజుకూ పెంచుతూ సామాన్య మానవుడి నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదాని, అంబాని వంటి బడా పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ ఆయిల్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే సామాన్యులపై భారం వేస్తున్నారని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో స్థానిక సిపిఎం కార్యాలయం నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ధర్నాలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ప్రజల పై భారాలు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి దేశాన్ని పాలించే అర్హత లేదని, తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు అంటూ ప్రజలపై భారాలు వేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు అంతర్జాతీయ సంక్షోభం ఉన్నా ధరలు పెరగవని నమ్మించి, ఎన్నికలు పూర్తి కాగానే దఫదఫాలుగా ధరలను పెంచుతూ ప్రజలకు ‘స్లో పాయిజన్’ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా వారం రోజుల్లోనే రూ.8 పెట్రోల్ ధర పెంచడం దుర్మార్గమన్నారు. ఆత్మకూరు పట్టణంలోని గౌడ్ సెంటర్ లో ద్విచక్ర వాహనాలను రహదారిపై తోచుకుంటూ వెళ్లి నిరసన తెలిపారు. కర్నూలు గడియారం హాస్పిటల్ ముందు నిరసన చేపట్టారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఇంధన ధరల పెంపు వల్ల సామాన్య మానవుడి జీవన వ్యయం పెరిగిపోతుందని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పులయ్య పేర్కొన్నారు. ఏర్పేడులోని వెంకటగిరి సర్కిల్ వద్ద ఆటో కార్మికులతో కలిసి సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ టిసి కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. కె.కోటపాడు మండలం ఆనందపురం జంక్షన్‌‌లో రాస్తారోకో చేశారు. నక్కపల్లి, కశింకోట, పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్లలో సిఐటియు ఆధ్వర్యాన ఆటో కార్మికులు ఆటోలకు తాడు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. విశాఖ నగరంలోని పూర్ణామార్కెట్‌ ‌వద్ద ముఠా వర్కర్లు నిరసన తెలిపారు. విజయవాడ రాణిగారితోటలో ధర్నా నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వరుసగా ధరలు పెంచుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘వ్యాట్’ పన్నులు వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనివల్ల ఆటో, ముఠా, గిగ్ వర్కర్లు నెలకు రూ.2000 నుండి రూ.5000 వరకు అదనంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ధరలు తగ్గించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరులో నిరసన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్