ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును ప్రకటించింది. పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్.. రమేష్‌ను ఖరారు చేశారని ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జనసేన పార్టీతో, పవన్‌కల్యాణ్‌తో 2015 నుంచి రమేష్‌కు అనుబంధం ఉందని తెలిపారు. శనివారం మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలొచ్చినా జనసేన సిద్ధాంతాలపైనా, పవన్‌కల్యాణ్ పైనా విశ్వాసం కనబర్చారని పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిళ్ళు, సవాళ్ళు ఎదురైనా సహనంతో నిలిచిన వారికి నామినేటెడ్ పదవుల్లో కుల, మతాలు పరిగణనలోకి తీసుకోకుండా అవకాశం కల్పించారని తెలిపారు. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్‌కల్యాణ్ పరిగణనలోకి తీసుకున్నారని వెల్లడించారు.
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 06, 2026, 12:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)