అమరావతి : ‘ గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే… అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం – అభివృద్ధి – సుపరిపాలన అందిస్తున్నాం ` అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా శుక్రవారం పోస్టు పెట్టారు. ఎపి లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా …. ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే… అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం – అభివృద్ధి – సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ…జై ఆంధ్రప్రదేశ్ ! ’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అన్నింటినీ అధిగమిస్తూ …. సుపరిపాలన అందిస్తున్నాం : సిఎం చంద్రబాబు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 12, 2026, 11:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)