test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపారదర్శక విధానాలే పరిష్కారం : మంత్రి అచ్చెన్నాయుడు

28 మే, 2026

atchennaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 28, 2026, 11:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‌ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయభారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రైతులు, ఫీడ్ తయారీదారులు, ఎగుమతిదారులు, పరిశ్రమ ప్రతినిధుల అభిప్రాయాలను ప్రభుత్వం గ్రహించిందని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో మేత ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే సమయంలో మేత పరిశ్రమ ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, పరిశ్రమ నిలదొక్కుకునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మేత, రొయ్యపిల్లల నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సిసి టివి ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసబిలిటీ, ఐఒటి ఆధారిత మానిటరింగ్ వంటి సాంకేతిక చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జిఎం సోయా దిగుమతులు, ఫిష్ మీల్ లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. ఆక్వా రైతుల సంక్షేమం, మేత పరిశ్రమ స్థిరత్వం, ఎగుమతుల వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, అందరు భాగస్వాములు పరస్పర సహకారంతో ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్, ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, ఎఎసి సభ్యులు, ఎపిఎస్‌ఎడిఎ సభ్యులు, రైతు సంఘాలు, ఫీడ్ తయారీదారులు, ఎగుమతిదారుల సంఘాలు, పరిశ్రమ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్