ప్రజాశక్తి-ఉదయగిరి : ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగవరం గ్రామంలో 11కెవి విద్యుత్ తీగలు తెగి పశువులపై పడడంతో మృత్యువాతపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు తమ పశువులను మోత కోసం తోలుకువెళ్లారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీశాయి. దీంతో పశువులను ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తెగి పశువులపై పడ్డాయి. దీంతో 13 పశువులు మృత్యువాతపడ్డాయి.
Print Editionవిద్యుత్ వైర్లు తెగిపడి 13 గేదెలు మృత్యువాత
27 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 27, 2026, 11:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)