test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐకమత్యం

6 రోజుల క్రితం

ఐకమత్యం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 02:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అభయ్ రామ్ ఐదవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన తండ్రితో కలిసి పొలానికి వెళ్ళాడు. తండ్రికి పొలంలో చిన్న చిన్న పనుల్లో సాయం చేశాడు. అభయ్‌ ‌బాగా అలసిపోవడంతో తండ్రి గమనించి, ‘అభయ్ రామ్ చెట్టు కిందకు వెళ్లి, విశ్రాంతి తీసుకో’ అని చెప్పాడు. పొలం గట్టుపైన ఒక గున్నమామిడి చెట్టు ఉంది. అభయ్ ఆ మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. చెట్టు పైన ఏవో పక్షల అరపులు, కీచులాట వినిపించింది. అభయ్ పైకి చూశాడు. చెట్ల కొమ్మలకు బాగా పండిన మామిడిపండ్లు కనిపించాయి. అందనంత ఎత్తులో ఉండటంతో.. కళ్లు మూసుకొని, పడుకున్నాడు. ఓ మామిడికాయ తినటానికి రెండు రామచిలుకలు ‘ఆ కాయ నాది అంటే.. నాది’ అని కొట్లాడుకుంటున్నాయి. మామిడికాయ చుట్టూ అటూ, ఇటూ తిరుగుతున్నాయి. రామచిలుకల కాలి వేళ్లు తగిలి, చెట్టు కొమ్మకున్న ఓ మామిడికాయ తెగి, కింద పడింది. ఆ శబ్దానికి అభయ్ రామ్ నిద్ర లేచాడు. కిందపడిన మామిడికాయ తీసుకున్నాడు. బాగా పండి, కమ్మటి వాసన వస్తున్న మామిడికాయను చూడగానే నోరూరింది. వెంటనే కడుక్కొని తినడం మొదలుపెట్టాడు. చెట్టు కొమ్మపై ఉన్న రామచిలుకలు అభయ్ రామ్ తింటున్న మామిడికాయ వైపు దీనంగా చూశాయి. ‘అయ్యో! ఇలా జరిగింది ఏంటి?’ అని అనుకున్నాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయాయి. కొద్దిసేపు తర్వాత ‘మనం గొడవపడకుండా ఉండి ఉంటే బాగుండేది’ అని అనుకున్నాయి. ‘ఇప్పటి నుంచి మనం ఏ కాయ దొరికినా ఇద్దరం ఐకమత్యంగా, స్నేహంగా ఉంటూ తిందాము. గొడవ పడొద్దు’ అని తుర్రుమంటూ చెట్టు పైనుంచి ఎగిరిపోయాయి.

జాదవ్ పుండలిక్ రావు పాటిల్
9441333315


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్