మూడు సంవత్సరాల నుంచి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. చాలామంది స్నేహితులు అయ్యారు. వాళ్ల ద్వారా ఎంతో నేర్చుకున్నాను. ఎన్నో కొత్త అనుభవాలు పొందాను. ఎన్నో ప్రదేశాలను చూశాను. ఉదయమే లేవటం, యోగ చేయడం, కషాయం తాగడం, వనంలో పనిచేయడం నాకు ఎంతో నచ్చాయి. వనంలో మొక్కలు నాటతాం. వాటికి నీరు పోసి, పురుగు మందులు వాడకుండా కూరగాయలు పండించుకుంటాము. రోజూ యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా మేము చక్కగా ఎదుగుతున్నాం. ఈ సంవత్సరం మేము పులిచింతల డ్యాము చూసాము. పండగలకి గుడికి వెళ్ళాము. సర్వోత్త మ గ్రంథాలయానికి వెళ్లి, పుస్తకాలు తెచ్చుకున్నాము. ఇంకా ఎన్నో చూశాము. ఈ సంవత్సరం నేను ASPL గా గెలవటం ఎంతో ఆనందంగా అనిపించింది. వినాయకచవితికి మట్టితో బొమ్మలు, రాఖీ పండుగకి విత్తనాలతో చేసిన రాఖీలు మంగళగిరి ఎకో పార్కులో అమ్మాము. అలాగే ఎన్నో పాటలు డ్యాన్స్‌లతో బాలానందం కూడా ఎంతో చక్కగా ప్రదర్శించాము. ఆ రోజు నేను యాంకరింగ్ చెయ్యడం ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రతి ఆదివారం కృష్ణానదికి అజయ్ సార్ తో ఈతకి వెళ్లేవాళ్లము. ఆదివారాలు సాయంత్రం మంచి సినిమాలు చూసాము. పౌర్ణమి రాత్రులు వెన్నన్నెలలో కూర్చొని భోజనం తిన్నాము. ఇలా ప్రతి వాటిల్లో ఉత్సాహంగా మేము పాల్గొంటాము. ఎంతో చక్కగా ఈ సంవత్సరం గడిచిపోయింది.

కె. సంజన రెడ్డి
9వ తరగతి,
అరవింద హైస్కూల్,
_కుంచనపల్లి, గుంటూరు జిల్లా.








కామెంట్‌లు (0)