test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అరకు యాత్ర ..

6 రోజుల క్రితం

అరకు యాత్ర ..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 02:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రవి అనే పిల్లవాడు7వ తరగతి చదువుతున్నాడు. తనకి గిరిజనుల జీవన స్థితిగతులు తెలుసుకోవాలనుకున్నాడు. పాఠశాలకు సంక్రాంతి సెలవులు వచ్చాయి. రవికి, క్లాస్‌ ‌టీచర్‌ ‘ఆదివాసుల స్థితిగతుల గురించి’ రాయమని హోంవర్క్‌ ఇచ్చారు. దాంతో రవి వాళ్ల కుటుంబం అరకు వెళ్లాలనుకున్నారు. మరుసటి రోజు వాళ్లు రైలులో అరకు వెళ్లారు. అక్కడ వాతావరణం రవికి చాలా నచ్చింది. గిరిజనుల దగ్గరకు వెళ్లి, వారిని అన్ని విషయాలు అడుగుతూ, ప్రతిదీ నోట్‌ ‌బుక్‌‌లో రాసుకోసాగాడు. ఆదివాసీలు ఎక్కువగా ఆ అడవిని నమ్ముకుని బతుకుతారు. అక్కడ నివసించే గిరిజనులు అందరూ కలిసి దింసా నృత్యం చేస్తారు. ఒకతను మధ్యలో ఒక వాయిద్యాన్ని పట్టుకొని ఉంటాడు. చుట్టూ ఆడవాళ్లు నృత్యం చేస్తారు. వాళ్లకు సరైన పోషకాహారం అందుబాటులో ఉండదు. కొత్త బట్టలు ఉండవు. వాళ్ల ప్రత్యేకత ప్రకృతి. వాళ్లు ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ ఉంటారు. వాళ్ల పిల్లలకు చదువు, సదుపాయాలు తక్కువ. వాళ్లకు వైద్యశాలలు చాలాదూరంలో ఉంటాయి. ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు… అడవిలో దొరికే ఆకులతో వైద్యం చేసుకుంటారు. ఆకులు, పూలు కలిపి మందులు తయారుచేస్తారు. ఉన్న సదుపాయాలతోనే తృప్తి చెందుతారు. ఇలా రవి అన్ని విషయాలు సేకరించి, టీచర్‌ ఇచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేశాడు. మనకు ఎప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు ఇలాంటి విహారయాత్రలకు వెళ్లి, కొత్త విషయాలు తెలుసుకుని, సంతోషంగా గడపవచ్చు.


అరకు యాత్ర ..


బి. ఉపేక్ష
7వ తరగతి,
అరవింద హైస్కూలు,
కుంచనపల్లి, గుంటూరు జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్