ఆసియాకప్ అండర్-18 హాకీ టోర్నీ
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ అండర్-18 పురుషుల హాకీ ఫైనల్లోకి భారత జట్టు ప్రవేశించింది శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో భారత జట్టు 5-3గోల్స్ తో పాకిస్తాన్ ను చిత్తు చేసింది. ముఖ్యంగా చివరి క్వార్టర్ లో పుంజుకున్న భారతజట్టు పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. మూడో క్వార్టర్ ముగిసేసరికి భారత జట్టు 2-3గోల్స్ తో పాకిస్తాన్ కంటే వెనుకబడింది. ఈ క్రమంలో నాల్గో, చివరి క్వార్టర్ లో భారతజట్టు ఏకంగా మూడు గోల్స్ చేసి మ్యాచ్ ను ముగించడం విశేషం. చివరి మూడో గోల్స్ ను యువ ఆటగాడు ఆశీష్ తాని చేశాడు. ఓవరాల్ గా సెమీస్ లో ఆశీష్ నాలుగు గోల్స్ తో మెరిసాడు. తొలి గోల్ ను భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ గోల్ పోస్టులోకి దూసుకెళ్లడంతో పెనాల్టీ స్టోక్ లభించింది. దీంతో 12వ ని.లో ఆశీష్ తాని పెనాల్టీ స్టోక్ ను గోల్ చేయడంలో భారత్ 1-0 ఆదిక్యతలో నిలిచింది. దీంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి భారత్ 1-0 ఆధిక్యతలో నిలిచింది. రెండో క్వార్టర్ ప్రారంభంలోనే 16వ ని.లో పాకిస్తాన్ కు పెనాల్టీ కార్నర్ లభించింది. భారత గోల్ కీపర్ ఆయుస్ రజాక్ ముందుకు రాగా.. పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ ఉజైర్ గోల్ చేశాడు. దీంతో తొలి అర్ధభాగం(రెండు క్వార్టర్లు) ముగిసేసరికి 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. మూడో క్వార్టర్ లో పాకిస్తాన్ అద్భుతంగా పుంజుకుంది. 35వ ని.లో పాసింగ్ మూవ్ ను షారుఖ్ అలీ గోల్ గా మలచడంతో భారత్ మళ్లీ 2-1గోల్స్ ఆధిక్యతలో దూసుకెళ్లింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కు రెండు పెనాల్టీ కార్నర్ లు లభించాయి. అహ్మద్ ఖురేష్ 42వ ని.లో రెండు గోల్స్ చేయడంలో పాక్ జట్టు 3-2 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. చివరి 15 నిమిషాల్లో భారత్ దూకుడుగా ఆడగా.. 46వ ని.లో పాకిస్తాన్ ఆటగాడు ముజమ్మిల్ సయీద్ కు గ్రీన్ కార్డ్ దక్కింది. ఆ తర్వాత భారత్ కు వరుసగా పెనాల్టీ కార్నర్ లు లభించడంత భారతజట్టు విజయం ఖాయమైంది. మరో సెమీస్ లో జపాన్ జట్టు 8-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో భారత యువ జట్టు టైటిల్ కు జపాన్ తో తలపడనుండగా.. లీగ్ దశలో భారత హాకీ జట్టు 2-4గోల్స్ తేడాతో జపాన్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో జపాన్ ను చిత్తు చేసి స్వర్ణ పతకం చేజిక్కించుకోవాలంటే చెమటోడ్చాల్సి ఉంది.
షూటౌట్ లో ఓడిన మహిళల జట్టు
సెమీఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు కు నిరాశ తప్పలేదు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారతజట్టు పటిష్ట చైనా చేతిలో షూటౌట్ లో ఓటమిపాలైంది. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ లో రెండు అర్ధభాగాలు ముగిసేసరికి ఇరుజట్లు 2-2గోల్స్ తో సమంగా నిలిచాయి. కానీ పెనాల్టీ షూటౌట్ లో భారత జట్టు 1-3తో చైనా చేతిలో ఓడింది. జపాన్-కొరియా జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ ఓడిన జట్టుతో భారత మహిళల జట్టు కాంస్య పతకానికి పోటీపడనుంది.








కామెంట్‌లు (0)