test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

T20 : కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. వైభవ్‌‌కు చోటు

06 జూన్, 2026

vibav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 01:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల టీ20 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌ల కోసం స్టార్ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా, యువ ఆటగాడు తిలక్‌ వర్మను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. ఈ జట్టులో ఇటీవలి ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన 15 ఏళ్ల యువ సంచలనం, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ వైభవ్‌ సూర్యవంశీకి తొలిసారిగా భారత సీనియర్ జట్టులో స్థానం లభించింది. తద్వారా భారత్ తరఫున ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణించిన ప్రిన్స్‌ యాదవ్‌కు కూడా ఈ పర్యటనల జట్టులో చోటు దక్కింది.

జట్టు ఇదే: శ్రేయస్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), బిష్ణోయ్‌, అభిషేక్‌ శర్మ, నితీశ్‌కుమార్‌, సిరాజ్‌, శాంసన్‌, అక్షర్‌పటేల్‌, హర్షిత్‌రాణా, ఇషాన్‌ కిషన్‌, వాషింగ్టన్‌, అర్ష్‌దీప్‌, శివమ్‌ దూబె, వరుణ్‌చక్రవర్తి, ప్రిన్స్‌యాదవ్‌, సూర్యవంశీ. అయితే, ఆసియా గేమ్స్‌ ప్రిన్స్‌ యాదవ్‌కు బదులు బుమ్రాకు అవకాశం ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్