test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

IND vs AFG ODI: కోహ్లీ స్థానంలో గైక్వాడ్ 

04 జూన్, 2026

ruturaj-gaikwad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 11:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆఫ్ఘనిస్తాన్‌తో వ‌న్డే సిరీస్‌కు రోహిత్, హార్దిక్ కూడా..

ముంబయి: ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జరిగే వ‌న్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఐపిఎల్ ఫైనల్లో గుజరాత్ టైటన్స్ పై మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల నొప్పికి గురైన కోహ్లి.. ఇంకా కోలుకోలేదు. దీంతో ఆఫ్ఘన్ తో వన్డే సిరీస్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారి ఒక‌రు తెలిపారు. 37 ఏళ్ల కోహ్లీ.. 2026 ఐపీఎల్‌లో 675 పరుగులతో రాణించి ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసందే. ఆ సీజ‌న్‌లో కోహ్లి ఒక సెంచ‌రీ, అయిదు అర్ధ సెంచ‌రీలు కొట్టాడు. ఐపిఎల్ మ్యాచ్ అనంతరం కోహ్లిని పరీక్షించిన డాక్టర్లు కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో అతడు జూన్ 20 నాటికి ఫిట్ నెస్ సాధించే అవకాశముంది. ఇక టెస్టు, టి20 క్రికెట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీతోపాటు రోహిత్‌ శర్మ కేవలం వ‌న్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇక జూన్ 13 నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. 13న ధర్మశాల వేదికగా తొలి వన్డే, ల‌క్నోలో 17న రెండో వ‌న్డే, చెన్నైలో 20న మూడో వ‌న్డే జ‌ర‌గ‌నున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా కూడా వన్డే సిరీస్ కు దూరం కానున్నారు. వారిద్దరి ఫిట్ నెస్ పై బిసిసిఐ నుంచి ఎలాంటి సమాచారం రాకున్నా.. వీరిద్దరూ ఐపిఎల్ లో గాయపడి టోర్నీ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్