test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అఫ్గాన్‌పై భారత్ ఆధిపత్యం.. ఫాలోఆన్ ముంగిట పర్యాటక జట్టు

5 రోజుల క్రితం

test
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 05:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముల్లాన్‌పూర్: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌పై భారత జట్టు తొలి రోజే సాధించిన ఆధిపత్యాన్ని రెండో రోజు కొనసాగిస్తూ.. మ్యాచ్‌ను పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. 368/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. అఫ్గాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ (126) మరోసారి క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించగా, రిషభ్‌ పంత్ 81 పరుగులు, ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) బాధ్యతాయుత హాఫ్ సెంచరీతోనూ మెరిశారు. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో ఒంటరి పోరాటం చేసినా భారత బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయాడు.

అనంతరం భారత బౌలర్ల ధాటికి అఫ్గానిస్థాన్ టాప్ ఆర్డర్ క్రీజులో నిలవలేక పూర్తిగా విలవిల్లాడింది. ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో రెండు వికెట్ల ప్రదర్శన చేయడంలో అఫ్గాన్ బ్యాటర్లు అబ్దుల్ మాలిక్ (16), సెదిఖుల్లా అటల్ (17), రహ్మనుల్లా గుర్బాజ్ (12), హస్మతుల్లా షాహిది (20) తక్కువ పరుగులకే చేతులెత్తేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసి తీవ్ర పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం రహ్మత్ షా (43 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తుండగా, ఆ జట్టు ఇంకా 451 పరుగుల భారీ వెనకంజలో ఉంది. భారత్ ప్రదర్శించిన ఈ ఆల్‌రౌండ్ ఆధిపత్యంతో అఫ్గానిస్థాన్‌కు ఫాలోఆన్ గండం స్పష్టంగా కనిపిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్